Monday, 27 May 2019

A Honest Appeal to all Janasainiks From Your Fellow Janasainik

Janasena-fans

As you are all already aware by now that General Elections will begin on April 11 across India.  The Election Commission on Sunday said the assembly election along with Lok Sabha elections in Andhra Pradesh will be held on April 11. The term of the Andhra assembly will come to an end on June 18.. The state has 175 assembly seats and 25 Lok Sabha.

As we are moving closer, one of Janasena follower, @chilll_bruh on Twitter has shared some interesting insights and steps to follow for all Janasena followers.

Here we are republishing the thread with his permission. Let us know your comments and please do share!

 

 

 

A long thread, మీరు జనసైనికులు కాకపోతే skip చేసేయండి. ఒకవేళ మీరు జనసైనికులు అయితే పూర్తిగా చదివి అర్థం చేసుకొని నచ్చితే RT చేయండి, ఎదో రాసాడు RT కొట్టేస్తే చాలు అనుకునేవాళ్లు దయచేసి ఇక్కడితో చదవడం ఆపేయండి.

Dear Sainiks, మనందరికీ జనసేన గెలవాలి అనే కోరిక ఉంది, కానీ ఆ కోరికకి బలం ఉందా? కీబోర్డు ల వెనకాల మనం చేసే చప్పుళ్ళకి కంచు కోటలు కూలతాయా?.. కష్టం. కంప్యూటర్ ల వెనకాల నుండి కదన రంగంలోకి అడుగు పెడితేనే అనుకున్నది సాధించగలం. I have a plan but I need every one of us to contribute…

మన దగ్గర ఉన్నది సరిగ్గా 27 రోజులు, ఈ 27 రోజులు కష్ట పడదామా లేక తరువాత 5 సంవత్సరాలు భాద పడదామా అనేది మీ నిర్ణయం. గుర్తుంచుకోండి మనం కష్టపడేది PK కోసమో, పార్టీ కోసమో కాదు.. ఈ సమాజం ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న ఒక మార్పు కోసం. మార్పులో భాగస్వాములం అవుదామా? ప్రేక్షకులుగా మిగిలిపోదామా?

ఈ 27 రోజులు జనసేనకి ఎలా campaign చేయాలి, మన దగ్గర ఉన్న బలం ఏంటి, ఉన్న బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఒక plan of action ని చెప్పే ప్రయత్నమే ఈ thread. ఏ campaign లో అయినా ఉండే basic principles

Mission –> Resources –> strategy –> Victory

అన్నింటినీ ఒక్కొకటిగా చూద్దాం

Mission:

జనసేన విజయం జనసేన కి ఎన్ని సీట్లు వస్తాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి.. ఇవన్నీ మనకి అనవసరం, జనసేన ఒక కొత్త పార్టీ, ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఎవరూ అంచనా వేయలేరు. ఇక్కడ ప్రశ్న జనసేన గెలుస్తుందా లేదా అనేది కాదు, జనసేనని మనం గెలిపించగలమా.. గెలిపించడానికి ఏం చేయగలం అనేదే ప్రశ్న

Resources:

నాకు తెలిసి జనసేన దగ్గర ఉన్న అతి పెద్ద బలం resources, కానీ ఈ resources అనుకున్న స్థాయిలో ఉపయోగపదట్లేడు. మనం ground level కి వెళ్తేనే resource maximization సాధ్యం అవుతుంది. నాకు తెలుసు మనలో చాలా మంది ఉద్యోగాల పరంగా, లేదా చదువు కోసమో మన సొంత ఊరికి దూరంగా ఉన్నాము.

ఈ 27 రోజులు పూర్తిగా మీ ఉద్యోగాలు వదిలేసి రావాల్సిన అవసరంలేదు. ఒక వారం రోజులు లేదా weekends వచ్చి campaign చేసినా పార్టీ విజయానికి చాలా తోడ్పడిన వారవుతారు. నా వంతుగా నేను ఒకటి లేదా రెండు వారాలు పూర్తిగా campaign కోసం dedicate చేస్తాను. 

జనసేన తరుపున ఆల్రెడీ PAC లు ఉన్నాయి కానీ సంఖ్యాబలం సరిపోదు, వాటికి మనం కూడా తోడవాలి. మనం కోఆర్డినేట్ అయి గ్రూపూలుగా form అవాలి. ఒక నియోజక వర్గానికి సంబంధించిన గ్రూపులో కనీసం 50 శాతం ఆ నియోజక వర్గానికి సంబంధించిన వారు (locals) ఉండేలా చూసుకోవాలి.

సాధారణంగా ఓటర్లని మూడు వర్గాలుగా విభజించవచ్చు. మనకి అనుకూలంగా ఉండే వాళ్లు, వ్యతిరేకంగా ఉండేవాళ్లు, తటస్థులు. మనం టార్గెట్ చేయాల్సింది తటస్థులు and ఏ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఇష్టపడని వాళ్లు. జనసేన కొత్త పార్టీ గనుక పోలింగ్ పెర్సెంట్ పెరిగితే ఎక్కువ లాభం జనసేనకే ఉంటుంది.

Strategy:

Resources ఉన్నాయి, టార్గెట్ గ్రూప్ ఉంది, కావాల్సింది strategy. ప్రచారానికి చాలా మార్గాలున్నాయి TV లు, పత్రికలు, hoardings.. కానీ అన్నిటికంటే ఎక్కువ ఫలితాన్నిచ్చేది మాత్రం door-to-door campaigning. ఈ 27 రోజుల్లో జనసేన కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి తలుపు తట్టాలి

Also read,

Campaigning లో ఉండే రెండు strategy లలో ఒకటి supporting strategy ఇంకొకటి attacking strategy.

మన పార్టీకి సపోర్ట్ చేయడంతో పాటు, వ్యతిరేక పార్టీలని ఎటాక్ చేయడం (policy based) కూడా చాలా ముఖ్యం. ఈ strategy లని ఎలాగ వాడచ్చో ఒకసారి చూద్దాం.
Supporting our party:
జనసేన వస్తే ఎలాంటి మార్పు వస్తుందో వివరించాలి. మీరెందుకు ఆఫీస్ లకి లీవ్ పెట్టి వచ్చారో, జనసేనకి ఎందుకు అండగా ఉన్నారో చెప్పండి. కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నప్పుడే చేసిన సహాయాలు, జనసేన వస్తే రాష్ట్రానికి జరిగే మేలు ఇవ్వన్ని వివరించండి.
ఒకే మేనిఫెస్టోతో అందరిని ఒప్పించలేము. ఇక్కడ మనం హైలైట్ చేయాల్సిన విషయాలని రెండు రకాలుగా వేరు చేయచ్చు.
ఒకటి macro level లో పార్టీ మేనిఫెస్టో,
రెండు micro level లో ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన సమస్యలు ఏంటి వాటికి జనసేన ఎలా పరిష్కారం చూపించగలదో వివరించాలి.
Value Proposition అంటారు, ఎవరికి ఏం చెప్తే convince అవుతారో తెలుసుకోవాలి. ఒక రైతుకి ఏం చెప్పాలి, ఒక గృహిణికి ఏం చెప్పాలి, ఒక నిరుద్యోగికి ఏం చెప్పాలి, ఆ ఊరిలో ఉండే సమస్యలు ఏంటి, ఆ విధిలో ఉండే సమస్యలు ఏంటి.. వాటికి జనసేన ఎలా పరిష్కారం చూపించగలదు… ఇవన్నీ స్పష్టంగా చెప్పాలి.
ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యలతో “customized pamphlets” ని ప్రిపేర్ చేసి, జనసేన ఆ ప్రాంత సమస్యలని అధ్యయనం చేసింది, పరిష్కారం కూడా ఇస్తుంది అనే నమ్మకం కలిగించాలి. మనం మిస్ అయిన సమస్యలు ఏవైనా వాళ్లు చెప్తే నోట్ చేసుకొని, తప్పకుండా పార్టీ దృష్టికి తీసుకెళతాం అనే భరోసా ఇవ్వాలి.
Attacking Strategy:
జనసేన మిగతా పార్టీల కంటే ఏ విధంగా బెటర్ అనే విషయాలతో పాటు, మిగతా పార్టీలో ఉన్న లోపాలని కూడా హైలైట్ చేయాలి. మచ్చుక్కి ఒక నియోజక వర్గంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వం ఎందుకు పరిష్కారం చూపించలేక పోయింది, ప్రతిపక్షం ఎందుకు పోరాడలేక పోయింది.. వీటిని హైలైట్ చేయాలి.
TDP నిరుద్యోగ భ్రుతి అంటుంది, జనసేన ఉద్యోగాలు ఇస్తాం అంటుంది.
YCP fee reimbursement అంటుంది,
అసలు fee కట్టే అవసరం లేదు అంటుంది జససేన.
ఇలా మనం ఏ విధంగా బెటర్ అని చెప్పాలి. (ఈ supporting and attacking strategy లో చాలా విషయాలు ఇక్కడ మాట్లాడలేను, internal గా మాట్లాడుకుందాం)
door-to-door campaign తో పాటు, యూత్ ఎక్కువగా ఉండే (కాలేజీలు, సినిమా హల్లు etc) చోట్లలో కూడా ప్రచారం చేయాలి. ప్రచారంతో పాటు.. పార్టీ గుర్తుని, అభ్యర్థులని కూడా బలంగా తీసుకెళ్లాలి. జనసేన మీద, కళ్యాణ్ గారి మీద జరిగే విష ప్రచారాన్ని కూడా వివరించే ప్రయత్నం చేయాలి.
మన దగ్గర ఉన్న బలాలు.. జన బలం, సోషల్ మీడియా. ఈ రెండిటిని పూర్తి స్థాయిలో వాడుకోవాలి. ఇందాక door-to-door campaign చాలా effective అనుకున్నాం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి person-to-person campaign గా మార్చాలి. ఒకసారి కాదు వీలయితే ఒకే ప్రాంతంలో రెండు మూడు సార్లు campaign చేయాలి.
ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేకొద్దీ జనసేన మీద తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్ ఎక్కువ అవుతాయి.. వీటిని ఎదుర్కోవడానికి మనం సోషల్ మీడియాని వాడుకోవాలి. Whatsapp, Facebook, Twitter ఇలా అన్నింటిలో ఫేక్ న్యూస్ ని తిప్పి కొట్టాలి. దీనిలో యూత్ ని ఎక్కువగా involve చేయాలి.
ground level లో campaign చేయలేని వాళ్లు మీ కుటుంబ సభ్యలు, చుట్టాలు, స్నేహితులు.. వీళ్ళల్లో ఉండే undecided voters లేదా ఓటు వేయడానికి కూడా ఇష్టం లేని వాళ్ల ఓట్లు జనసేనకి పడే భాద్యత మీరు తీసుకోండి. ఇందాక చెప్పుకున్నట్టు పోలింగ్ percentage పెరిగితే జనసేన కి విజయావకాశాలు పెరిగినట్టే.
మనం ఏం చేయగలం అని ఒక ఉదాహరణ చెప్పడానికే ఈ కొన్ని పాయింట్స్ చెప్పాను, కలిసి కట్టుగా ప్రయత్నిస్తే ఇంకా చాలా చేయచ్చు (energy + energy = synergy). మంచి చేయడానికి మనకి కావాల్సిన ఒక వ్యక్తి అడుగేసాడు, తోడుగా ఉండడం మన బాధ్యత. జనసేన.. మనమే నిర్మించిన సేన, మనమే గెలిపించుకుందాం.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *